Pages

Friday, 26 July 2013

పప్పు పాయసం

మీకు పరిచయం చేసే మొదటి వంట కదండీ.. అందుకే ఈ పప్పు పాయసం. దీని రుచి ఆస్వాదిస్తూ నా బ్లాగ్ ని ఆహ్వానించండి :)

Google photo
కావలసిన వస్తువులు:

  1. పాలు - అర లీటర్ 
  2. బియ్యం - ఒక కప్పు
  3. పెసరపప్పు - అర కప్పు 
  4. బెల్లం - పావుకిలో (తీపి ఇష్టమైన వారు తమ రుచిని బట్టి ఇంకా వేసుకోవచ్చు. అలాగే బెల్లం తక్కువ ఉంటే పంచదార కూడా వేసుకోవచ్చు)
  5. జీడిపప్పు,  ఎండుద్రాక్ష - కొద్దిగా (మీ రుచికి అనుగుణంగా)
  6. నెయ్యి - 50 గ్రాములు 
  7. యాలకులు - 4
  8. పచ్చకర్పూరం - రెండు చిటికెలు 
తయారుచేసే విధానం:

ముందుగా పాలు కాచుకుని పొంగు రాగానే అందులో నానబెట్టిన పెసరపప్పు, బియ్యం వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి (అవసరమయితే కాస్త నీళ్ళు పోసుకోవచ్చు). బాగా ఉడికింది అనిపించినపుడు బెల్లం నలగొట్టి అందులో కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగిన తరువాత అందులో యాలకుల పొడి, పచ్చ కర్పూరం వేసి దించేయాలి. తరువాత విడిగా నెయ్యిలో జీడిపప్పు, ఎండుద్రాక్ష వేయించుకుని  నెయ్యితో సహా పాయసంలో కలుపుకోవాలి. అంతే! టేస్టీ, టేస్టీ పప్పు పాయసం రెడీ!

నేను ఇంత వరకూ ఫోటోలేవీ తీయలేదండి. అందుకే ఇప్పటికి గూగుల్ ఫోటో పెట్టాను. ఇకపై నా వంటలు ఫోటోలతో సహా పోస్ట్ చేస్తాను :)

7 comments:

వేణూశ్రీకాంత్ said...

ఈ పప్పుపాయసం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో భోజనంలోకి చేస్తారండీ, నేను మొదటిసారి అక్కడే తిన్నాను చాలా నచ్చేసింది. అప్పుడు వాకబు చేస్తే సీమలో విశిష్టమైన అతిధులను సత్కరించే పద్దతులలో ఈ పప్పుపాయసం వండిపెట్టడం కూడా ఒకటి అని చెప్పారు.

మొత్తానికి శుభప్రదమైన వంటతో మొదలెట్టారు మీ బ్లాగ్ దిన దిన ప్రవర్ధమానమై మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. కేవలం ఫార్ములాయిక్ రెసిపీతో సరిపెట్టేయకుండా వంటలో మెళకువలు చిన్న చిన్న చిట్కాలు కూడా జతచేయండి, వంటకొత్తగా నేర్చుకునేవారికి ఉపయోగపడాతాయి. ఆల్ ద బెస్ట్ :)

Geetha Pavani said...

Thanq అండి. బాగా చెప్పారు ,నేను కూడా సీమప్రాంతం నుండే వచ్చాను . నెమ్మదిగా సీమ రుచులని పరిచయం చేస్తాను . తప్పకుండా మీ సలహా ప్రకారం నాకు తెలిసిన టిప్స్ చెప్తాను .

రాధిక(నాని ) said...

బాగుంది గీతగారు .మేము చక్కెర పొంగలి చేస్తాము .కొంచం ఇలాగె ఉంటుంది .కానీ గట్టిగా ఉంటుంది .ఇలా ట్రై చేయాలి.

చిన్ని ఆశ said...

బాగుందండీ, ఎప్పుడో చిన్నపుడు హాస్టల్ లో తిన్నదే. ఇప్పుడు ఎంచక్కా చేసుకునేలా రెసిపీ ఇచ్చారు.
నోరూరించే మరిన్ని వంటలు మీ ఇంటి నుంచి మా ఇంటిదాకా రావాలి ;)

ప్రియ said...

ఈ పాయసం ఎప్పుడూ తినడమే కానీ , చేయలేదు ...థాంక్సండీ ..మా ఇంట్లో రేపు దేవుడికి ఇదే నైవేద్యం :)

Geetha Pavani said...

ప్రియ గారికి మీకు వరాలమూట అందిందనుకుంటున్నాను ,ఎందుకంటే పప్పుపాయసంతో దేవున్ని మెప్పించారుగా......

డేవిడ్ said...

ఒక మంచి బ్లాగ్ ను ప్రారంభించారు గీత గారు...ఆల్ ది బెస్ట్.

Post a Comment