నా పేరు గీత. వృత్తిరీత్యా వైద్యురాలినే అయినా.. నాలుగేళ్ల నా కొడుకు పుణ్యామా అని ఇప్పటికి మాత్రం
హోంమినిస్టర్ (మా ఇంటికి) గా ఉన్నాను. సదా నా వంటలను మెచ్చుకుంటూ ఈ వంటలను నలుగురికీ రుచి చూపించమని
నా స్నేహితురాలు ప్రోత్సహించడంతో ఇలా మీ ముందుకి వచ్చాను.
ఈ బ్లాగ్ లో నాకు మా అమ్మ నేర్పిన, నేను ప్రయోగించిన రకరకాల వంటకాలను సులువుగా చేసుకునేందుకు వీలుగా మీకు పరిచయం చేస్తాను.
17 comments:
హమ్మయ్య! బ్లాగ్ స్టార్ట్ చేసేశారు కదా.. నాలాటి చాలా మందికి హెల్ప్ అవడం ఒక + పాయింట్ అయితే, ఇకపై ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఫోన్ చేసే పని లేకుండా హాయిగా బ్లాగ్ చూసుకోగలగడం మరో +పాయింట్ :D.
Happy blogging, akka. I wish you all the best :)
naku kuda vanta sariga radandi.meeru rastu vundadi,nenu chusi nerchukontanu.i will try this definitely.
Welcome Geeta gaaru.
@శ్రావ్య గారు, వనజ గారు: Thanq very much for ur responce. తప్ప కుండా మీకు కూడా నచ్చేలా నా వంటలు ఉంటాయనుకుంటున్నాను.
@ Priya: Thank u Priya :-)
శనివారం కదండీ, ఏమైనా వండుకున్దామని వంట బ్లాగుల వేటలో పడితే అనుకోకుండా ప్రియ గారి బ్లాగ్ ద్వారా మీ బ్లాగ్లోకి వచ్చాను. త్వరగా పోస్ట్లు రాస్తే నాబోటి వాళ్లకు సాయంగా ఉంటుంది.
స్వాగతం గీత గారూ . తీపితో శుభారంభం చేశారు . బాగుంది .
బ్లాగు మొదలుపెట్టినందుకు శుభాకాంక్షలండి.మాకు కొత్త రుచులు చూపిస్తారని ఆశిస్తున్నాను.
మీ సీమ రుచులన్నీ మాకు నేర్పేయాలి
ప్రియ గారి బ్లాగ్ ద్వారా తెలిసింది మీరు బ్లాగ్ కి శ్రీ కారం చుట్టారని.
అభినందిస్తూ, మీ ఇంటి వంట ప్రతి ఇంటా, వంటా చేరిపోవాలని ఆశిస్తూ...
నూతన బ్లాగ్ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు ...
happy blogging geeta garu :)
మిమ్మల్ని నిరుత్సాహపరిచినందుకు sorry harsha గారు . తప్పక మీకు ఉపయోగపడేలా వంటలు తెలుపగలనని అనుకుం టున్నాను .
@ nagarani గారు ,radhika గారు ,mohana గారు అందరికి thanks. సీమ వంటల్లో ఏ వంట కావాలనుకుంటున్నారు చెప్పగలరు.
పప్పుపాయసంతో మెప్పించారుగా దేవున్ని వరాలమూట అందుకున్నారా ?
Happy food blogging :)
ప్రియ ద్వారా మీరు పరిచయం కావడం... సంతోషం గీతగారు...
పప్పూ పాయసంతో ముందుగా మెప్పించిన మీరు మరిన్ని వంటకాలతో మమ్మల్ని అలరించాలని కోరుకుంటూ...
హ్యాపీ బ్లాగింగ్... అండ్ కుకింగ్... :)
ప్రియ గారి బ్లాగు నుండి రావటం, మంచి మంచి వంటలతో మమ్మలిని ఉక్కిరి బిక్కిరి చెయ్యాలని కోరుకుంటూ, అభినందనలు
Post a Comment